కొల్లూరులో సర్పంచ్ మార్నింగ్ వాక్..
ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొల్లూరు గ్రామంలో సర్పంచ్ జనగాం సుధారాణి శ్రీపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో మార్నింగ్ వాక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు వీధుల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాల అమలు తీరు, ప్రజలకు అందుతున్న సేవలపై వారి అభిప్రాయాలను సేకరించారు.
నియోజకవర్గంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నిర్వహిస్తున్న మార్నింగ్ వాక్ కార్యక్రమం స్ఫూర్తితో కొల్లూరు గ్రామంలోనూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సర్పంచ్ సుధారాణి శ్రీపాల్‌రెడ్డి తెలిపారు. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గాజుల దశరథ యాదవ్, గ్రామ శాఖ అధ్యక్షుడు గాజుల ఆంజనేయులు, మాజీ వైస్ ఎంపీపీ గాజుల లావణ్య వెంకటేష్ యాదవ్, మాజీ సర్పంచులు గాజుల నరసయ్య యాదవ్, పిల్లలమర్రి శంకరయ్య, నాయకులు ఎండీ జియాలాల్, గ్యాదపాక మల్లేష్, గ్యాదపాక సురేష్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బరపటి నర్సింగరావు, ఉపాధ్యక్షులు కాన్‌రాజు ఉమేష్, కలకోటి హరీష్, పట్టేగూడెం మహేష్ తదితరులు పాల్గొన్నారు.
