TG | ఈ నెలాఖ‌రు లేదా, మే మొద‌టివారంలో..

TG | ఈ నెలాఖ‌రు లేదా, మే మొద‌టివారంలో..

TG | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలు ఈ నెలాఖ‌రులో వెల్ల‌డయ్యే అవ‌కాశం ఉంది. ఏప్రిల్ 30, లేదా మే మొదటి వారంలో విడుద‌ల చేసేందుకు విద్యాశాఖ అధికారులు సిద్ధ‌మ‌వుతున్నారు. పేప‌ర్ల మూల్యాంక‌నం పూర్తి చేసిన బోర్డు ఫ‌లితాల విడుద‌లకు సిద్ధ‌మ‌వుతోంది. సందేహాలున్న జ‌వాబు ప‌త్రాల‌పై డీఈవోల‌తో మాట్లాడి ప‌రిష్క‌రిస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు. డిఫిక‌ల్టీ ప్ర‌శ్న‌ల‌పై ఎక్స్ ప‌ర్ట్స్ ప‌రిశీల‌న పూర్తి చేశారు. హిందీలో 1 త‌ప్పా ఏ స‌బ్జెక్టులోనూ స‌మ‌స్య లేదు. మార్కుల కంప్యూట‌రీక‌ర‌ణ‌, వెరిఫికేష‌న్ కోసం 14 రోజుల టైం ప‌డుతుంద‌ని అధికారులు చెబుతున్నారు. ఆపై రిజ‌ల్ట్స్ ప్ర‌క‌ట‌న ఉంటుందంటున్నారు. ఏప్రిల్ 16న టెన్త్ పరీక్షలు ముగిశాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షలకు పైగా విద్యార్థులు ప‌రీక్ష‌లు రాశారు.

Leave a Reply