TG | సిగాచి బ్లాస్ట్ లో మ‌రొక‌రి మృతి .. 40కి చేరిన మ‌ర‌ణాలు

ఇప్ప‌టికే 40కి చేరిన మ‌ర‌ణాలు
నేడు మ‌రో మూడు మృత‌దేహాలు గుర్తింపు
ఇద్ద‌రు బీహార్, ఒక‌రు ఒడిశాకు చెందిన వారు
డిఎన్ఎ ఆధారంగా మృత దేహాలు గుర్తింపు
36 మృత‌దేహాల‌ను బంధువులకు అప్ప‌గింత

పటాన్ చెరు – సిగాచి కంపెనీ (sigachi company ) వద్ద ఆరో రోజు (sixth day ) సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ (NDRF ) సిబ్బంది, భారీ యంత్రాలతో సహా హైడ్రా (Hydraa ) సిబ్బంది శిథిలాలను తొలగిస్తున్నారు. ఇదిలా ఉండగా పేలుడులో గాయపడి ధ్రువ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మున్మున్ చౌధరి (mummun chodary ) మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 40కి పెరిగింది.


కాగా, ఈ ప్రమాదంలో మ‌ర‌ణించిన ముగ్గురు మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. తాజగా గుర్తించిన మృతుల్లో ఇద్దరు బిహార్‌కు, ఒకరు ఒడిశాకు చెందిన కార్మికులుగా తేలింది. ఇప్పటి వరకు మొత్తం 36 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. బిహార్‌ నుంచి పలువురు ప్రజాప్రతినిధులు ప్రమాద స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు. సహాయ కేంద్రం వద్ద బిహార్ ఎంపీతో పాటు ఇతర నాయకులు బాధిత కుటుంబాలతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.

Leave a Reply