MUSIC | ఆశా భోంస్లే జీవితం… ఆసక్తికర విషయాలివే…

MUSIC | ఆశా భోంస్లే జీవితం… ఆసక్తికర విషయాలివే…

ప్రఖ్యాత గాయని ఆశా భోంస్లే జీవితం అంటే… కేవలం పాటల ప్రయాణం కాదు, పోరాటం, పట్టుదల, ప్రయోగాల కథ.

MUSIC | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన ఆశా, కుటుంబాన్ని నిలబెట్టేందుకు సినీ రంగంలోకి అడుగు పెట్టాల్సి వచ్చింది. ఆ వయసులో ఆ బాధ్యత తలకెత్తుకోవడం ఎంత కష్టం అనేది ఊహించుకోవచ్చు.

ఆమె అక్క లతా మంగేష్కర్ అప్పటికే సంగీత ప్రపంచాన్ని ఏలుతున్న కాలం. ఆ నీడలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించడం ఆశాకు పెద్ద సవాలే. అందుకే మొదట వచ్చినవి చిన్న పాటలే… కానీ వాటినే ఆమె అవకాశాలుగా మార్చుకుంది.

చాలా మంది చిన్నచూపు చూసిన క్యాబరే, వెస్ట్రన్ స్టైల్ పాటలను ఆశా మాత్రం గుండెల్లో పెట్టుకుని పాడింది. అదే తర్వాత ఆమెకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది.

ఒకసారి కాదు… ఎన్నోసార్లు ఒకే రోజులో 10 కి పైగా పాటలు రికార్డ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలసట అనే మాట ఆమె డిక్షనరీలో లేదనిపించేంత శ్రమ.

సంగీత దర్శకుడు ఆర్ డీ బర్మన్ తో కలిసి పాప్, జాజ్, ఘజల్—ఏది అయినా సరే, ఏదైనా కొత్తగా అనిపిస్తే ముందే ప్రయత్నించేది.

వయస్సు పెరిగినా ఆమెలో ఉత్సాహం మాత్రం తగ్గలేదు. రాంగీలా సినిమాలో వచ్చిన పాటలతో యువతను కూడా అలరించడం… ఆమెకే సాధ్యం.

సంగీతం పక్కన పెడితే… ఆమెకు వంట అంటే అమితమైన ఇష్టం. ఆమె చేతి బిర్యానీ, కబాబ్‌లకు బాలీవుడ్ ప్రముఖులు అభిమానులు కావడం ఆసక్తికరం.

ఆమె పేరు మీద విదేశాల్లో రెస్టారెంట్లు ప్రారంభించడం… గాయని మాత్రమే కాదు, వ్యాపారవేత్తగా కూడా నిలిచిన అరుదైన విషయం.

ఒక పాట రికార్డింగ్ సమయంలో “పర్ఫెక్ట్ రావాలి” అని గంటల తరబడి మళ్లీ మళ్లీ పాడిన సందర్భాలు ఉన్నాయి. కళపట్ల, వృత్తి పట్ల అదే ఆమె నిబద్ధత.

వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా… ఒక విషయం మాత్రం ఎప్పుడూ వదల్లేదు—సంగీతం. అదే ఆమెను ప్రపంచ స్థాయి గాయని గా నిలబెట్టింది.

Leave a Reply