Ruhani Sharma | గ్లామర్ డోస్ పెంచిన రుహాని శర్మ..

Ruhani Sharma | గ్లామర్ డోస్ పెంచిన రుహాని శర్మ..

  • నెటిజన్లకు నిద్ర లేకుండా చేస్తున్న అందాల విందు!

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ రుహాని శర్మ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ‘చి ల సౌ’, ‘హిట్’, ‘డర్టీ హరి’ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన ఈ భామ.. ఇప్పుడు గ్లామర్ ఫోటోషూట్లతో అభిమానులను ఫిదా చేస్తోంది.

ఒకవైపు సినిమాలు, మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ఇటీవల రుహాని శర్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో, గ్లామర్ డోస్‌ను మరింత పెంచుతూ కనిపించిన ఆమె ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

ప్రస్తుతం ఆమె షేర్ చేసిన గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ప్రస్తుతం రుహాని శర్మ నటిస్తున్న అత్యంత ఆసక్తికర చిత్రాల్లో “ఆల్కహాల్” ఒకటి. యాక్షన్-క్రైమ్-థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోగా అల్లరి నరేష్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో రుహాని పాత్రకు కూడా మంచి ప్రాధాన్యత ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఇక మరోవైపు రుహాని శర్మ నటిస్తున్న “ఆకాశంలో ఒక తార” సినిమా కూడా భారీ అంచనాలు సృష్టిస్తోంది. పవన్ సాదినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. శ్రుతి హాసన్‌తో పాటు రుహాని శర్మ కూడా కీలక పాత్రలో కనిపించనుంది. రుహాని తదుపరి సినిమా ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply