మునిగేటి గిరిధర్ కు నేషనల్ అవార్డు ప్రదానం

మునిగేటి గిరిధర్ కు నేషనల్ అవార్డు ప్రదానం


తొర్రూరు, ఆంధ్రప్రభ:
తొర్రూరు మండలంలోని సోమవారం గ్రామానికి చెందిన మునిగేటి గిరిధర్ నేషనల్ అవార్డును అందుకున్నారు. తాజాగా హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన బహుజన సాహిత్య అకాడమీ 9వ తెలంగాణ స్టేట్ కన్ఫరెన్స్ లో బహుజన సాహిత్య అకాడమీ(బి ఎస్ఏ) జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీల సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం బహుజన సాహిత్య అకాడమీ ప్రతి సంవత్సరం ప్రజా ఉద్యమకారులు, సంఘ సేవకులు, రచయితలు, కవులు, స్వచ్ఛంద సంస్థలకు ఈ అవార్డును అందిస్తున్నట్లు తెలిపారు. మునిగేటి గిరిధర్ మాట్లాడుతూ… తనకు ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తానన్నారు. అవార్డు అందించిన రాధాకృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply