భద్రాచలం వంతెనపై కలకలం…

భద్రాచలం వంతెనపై కలకలం…

  • గోదావరిలోకి దూకి తల్లి, బిడ్డ ఆత్మహత్యాయత్నం
  • ధైర్యంగా కాపాడిన ఈతగాడు సిమ్మర్ ప్రసాద్

భద్రాచలం (టౌన్), ఆంధ్రప్రభ : భద్రాచలం గోదావరి వంతెనపై నుంచి ఒక వివాహిత తన 18 నెలల బిడ్డతో కలిసి గోదావరిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది.

స్వరూప అనే మహిళ తన బిడ్డతో కలిసి వంతెనపై నుంచి నదిలోకి దూకినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు గజఈతగాళ్లకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న ఈతగాడు సిమ్మర్ ప్రసాద్ నీటిలో ఉన్న తల్లి–బిడ్డను గుర్తించి చాకచక్యంగా ఒడ్డుకు చేర్చాడు.

స్వరూప పాల్వంచ కలెక్టర్ కార్యాలయం సమీపంలో నివాసముంటున్నట్లు తెలిసింది. ఇటీవల ఆమె భర్త మృతి చెందినట్లు సమాచారం. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

తల్లి–బిడ్డలను వెంటనే ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పట్టణ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Leave a Reply