TG | పిల్లలకు పతంగుల పంపిణీ..

TG | పిల్లలకు పతంగుల పంపిణీ..
- ఆకాశంలో పతంగులు ఎంత ఎత్తుకు ఎగురుతాయో..
- మీ కలలు అంతకంటే ఎత్తుకు చేరాలి
- పిల్లలకు పతంగులు పంపిణీ చేసిన బిజెపి జిల్లా అధ్యక్షుడు
- చైనా మాంజ వినియోగించరాదు
- బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్
TG | కరీమాబాద్, ఆంధ్రప్రభ : భోగి, సంక్రాతి పండగను పురస్కరించుకొని శివనగర్ ప్రాంతంలోని చిన్నారులకు పతంగులను ఉచితంగా బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… మన సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించాలని ఉద్దేశంతో పతంగుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. చిన్న పిల్లలకు ఉచితంగా పతంగులను పంపిణీ చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు.
పిల్లలు చైనా మాంజాను ఉపయోగించి ప్రాణాల మీదకి తెచ్చుకోకుండా, సాధారణ మాంజాను వాడాలని సూచించారు. సంక్రాంతి పండుగ మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. పతంగుల పండుగ ద్వారా పిల్లల్లో ఆనందం, ఉత్సాహం వెల్లివిరుస్తుందనీ, ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో సోదరభావం, ఐక్యతను మరింత బలపరుస్తాయని తెలిపారు. పిల్లలు ఆరోగ్యంగా, ఆనందంగా పెరిగి దేశానికి, సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని ఆకాంక్షిస్తూ వారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
శివనగర్ వాసులకు 34, 35వ డివిజన్లలో శ్రీ అయోధ్య రాముడి 2026వ సంవత్సర క్యాలెండర్లు పంపిణీ చేస్తూ వారికి భోగి అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మహమ్మద్ రఫీ, మండల జనరల్ సెక్రెటరీ వైట్ల గణేష్, కరీంబాద్ మండల జనరల్ సెక్రెటరీ రాజకుమార్, 38వ డివిజన్ ఇనుముల అరుణ్, 33వ డివిజన్ ముద్దసాని కృష్ణ, బూత్ అధ్యక్షులు శెట్టి రమేష్, టీవీ ఎల్ ఎన్ శ్రీనివాస్, దాసి రమేష్, బిజేవైఎం BJYM వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు బొజ్జ రంజీత్, 35వ డివిజన్ అధ్యక్షులు సూరజ్, ఓబీసీ మోర్చా డివిజన్ అధ్యక్షులు బోడకుంట్ల శివశంకర్, కందుకూరి విజయ్ కుమార్, గంట సందీప్ అండ్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
