హోలీ పండగ ఐక్యతకు సౌబ్రాతృత్వానికి ప్రతీక

నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : నర్సంపేట నియోజకవర్గంలో హోలీ పండుగ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలతో కలిసి రంగుల హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఉత్సాహ భరితమైన నినాదాలు, రంగుల పలకరింపులు, హర్షధ్వానాల మధ్య నర్సంపేట పట్టణం పండుగ వాతావరణంతో కళకళలాడింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ హోలీ పండుగ ఐక్యతకు, సౌభ్రాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు.

మంచి చెడుపై గెలిచే సంకేతంగా జరుపుకునే ఈ రంగుల పండుగ ప్రతి కుటుంబంలో ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వేడుకున్నారు. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, రైతులు, యువత ఎలాంటి ఇబ్బందులు లేకుండా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల అండతో నర్సంపేట అభివృద్ధికి మరింత కట్టుబడి పనిచేస్తానని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని హోలీ సంబరాలను మరింత ఉత్సాహంగా మార్చారు. రంగుల సందడి మధ్య పరస్పరం అభినందనలు తెలియజేసుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. నర్సంపేటలో ఈ హోలీ వేడుకలు రాజకీయ వర్గాల్లో కూడా ఉత్సాహాన్ని నింపాయి. రంగుల సందడిలో ఐక్యత సందేశం వినిపించిన ఈ హోలీ వేడుకలు నియోజకవర్గ ప్రజలకు చిరస్మరణీయంగా నిలిచాయి. నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు,

వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, రైతులు, యువత ఎలాంటి ఇబ్బందులు లేకుండా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల అండతో నర్సంపేట అభివృద్ధికి మరింత కట్టుబడి పనిచేస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని హోలీ సంబరాలను మరింత ఉత్సాహంగా మార్చారు. రంగుల సందడి మధ్య పరస్పరం అభినందనలు తెలియజేసుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. నర్సంపేటలో ఈ హోలీ వేడుకలు రాజకీయ వర్గాల్లో కూడా ఉత్సాహాన్ని నింపాయి. రంగుల సందడిలో ఐక్యత సందేశం వినిపించిన ఈ హోలీ వేడుకలు నియోజకవర్గ ప్రజలకు చిరస్మరణీయంగా నిలిచాయి.

Leave a Reply