చివరి గింజ వరకూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది

చివరి గింజ వరకూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది

  • రైతులెవ్వరూ అధైర్య పడొద్దు
  • టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలజగ్గారెడ్డి

సంగారెడ్డి ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ‌: చివరి వడ్ల గింజ వరకూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ఈ విషయంలో రైతులెవరూ అధైర్య పడవద్దని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల‌జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం కంది మండలం కలివేముల గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్మలజగ్గారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు విషయంలో నిబద్ధ‌తతో ఉందని, రైతులు పండించిన పూర్తి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. ప్రైవేట్ రైస్ మిల్లర్ల వద్ద ధాన్యం అమ్మవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్దనే అమ్మాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ బ్లాక్ ప్రెసిడెంట్ చిదృప్ప రఘురాంగౌడ్‌, కంది మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొగులయ్య, మాజీ అధ్య‌క్షుడు మోతిలాల్, పీఏసీఎస్ చైర్మ‌న్ ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్ పవిత్ర, ఉప సర్పంచ్ నాగరాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మ‌స్కు నర్సింహారెడ్డి, వార్డు మెంబర్లులు, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply