చౌటుప్పల్ లో బీజేపీ విజయోత్సవ సంబరాలు

చౌటుప్పల్ లో బీజేపీ విజయోత్సవ సంబరాలు

​చౌటుప్పల్, ఆంధ్రప్రభ : పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధించి, కాషాయ జెండా రెపరెపలాడిన సందర్భంగా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. చౌటుప్పల్ పట్టణంలో బీజేపీ మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పన ఐలయ్య యాదవ్, రూరల్ అధ్యక్షులు కైరంకొండ అశోక్ ల ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంపిణీ చేశారు.

​ఈ సందర్భంగా నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ వంటి కీలక రాష్ట్రాల్లో బీజేపీ అధికారం చేపట్టడం దేశాభివృద్ధికి చారిత్రక అవసరమని పేర్కొన్నారు. ఇదే ఉత్సాహంతో రాబోయే 2028 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కంకణబద్ధులై క్షేత్రస్థాయిలో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దూడల భిక్షం గౌడ్, సీనియర్ నాయకులు రమణగోని శంకరయ్య, గుజ్జుల సురేందర్ రెడ్డి, ముత్యాల భూపాల్ రెడ్డి, చినుకుని మల్లేశం, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, పాలకూర్ల జంగయ్య, దాసోజు బిక్షమాచారి, ఊడుగు యాదయ్య, వెంకటేశం, బత్తుల జంగయ్య, సర్పంచ్‌లు నందగిరి వెంకటేశం, బోయ మహేంద్రమణి శరత్ కుమార్, కౌన్సిలర్లు పోలపల్లి లక్ష్మీ ముత్తయ్య, బుడ్డ సురేష్, ఆలే శ్రీలత చిరంజీవి, గోషిక నీరజ, దిండు భాస్కర్, పలువురు బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.