దండేపల్లిలో బీజేపీ శ్రేణుల విజయగర్జన

దండేపల్లిలో బీజేపీ శ్రేణుల విజయగర్జన

దండేపల్లి,ఆంధ్రప్రభ: పశ్చిమ బెంగాల్‌తో పాటు మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించిన సందర్భంగా సోమవారం దండేపల్లి మండల కేంద్రంలో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. దండేపల్లి మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పత్తిపాక సంతోష్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ కోటను బద్దలు కొట్టి, ప్రజలు చారిత్రాత్మక తీర్పునిస్తూ బీజేపీకి పట్టం కట్టడంపై నాయకులు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు టపాసులు పేల్చి, మిఠాయిలు పంపిణీ చేస్తూ జై శ్రీరామ్, నరేంద్ర మోదీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.

​ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందిస్తున్న సుపరిపాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఈ విజయమే అందుకు నిదర్శనమని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ జెండా ఎగరడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు.

​ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, గుండా ప్రభాకర్, అసెంబ్లీ ఇంచార్జి గోపతి రాజయ్య, ప్రధాన కార్యదర్శులు, అనిల్,అక్కల దివ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు, ఎంబడి సురేందర్, బెడద సురేష్, తులసి, లక్ష్మీనారాయణ, బోడకుంటి వెంకటేష్, చుంచు గిరిధర్, వెంకటేష్, గురువయ్య, గాలిపల్లి సత్యనారాయణ, శ్రీనివాస్, కుమార్, మల్లేష్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.