అకాల వర్షం.. తడిసిన ధాన్యం..

అకాల వర్షం.. తడిసిన ధాన్యం..

  • కొనుగోళ్లు ప్రారంభం కాలేదని రైతుల ఆవేదన

నర్సింహులపేట, ఆంధ్రప్రభ: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది.అకాల వర్షాలతో చేతికంది వచ్చిన వరి ధాన్యంతో పాటు మక్కలు కూడా తడిసి ముద్దయ్యాయి.తూకాలకు సిద్ధం చేసిన దాన్యం బస్తాల కిందికి వర్షం నీరు వచ్చి చేరింది. కేంద్రాల్లో దాన్యం పోసి 20 రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు ప్రారంభించ లేదని,తీరా అకాల వర్షంతో దాన్యం తడిసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పిఎసిఎస్ కేంద్రం నిర్వాహకులు పరదాలు ఇవ్వడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply