Telangana Formation Day Security | వేడుకలకు పకడ్బందీ బందోబస్తు

Telangana Formation Day Security | వేడుకలకు పకడ్బందీ బందోబస్తు
పర్యవేక్షించిన మల్కాజ్‌గిరి సీపీ సుమతి
Telangana Formation Day Security | ఆంధ్ర్రప్రభ వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 2న ఘనంగా నిర్వహిస్తారు. ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం విస్తృత స్థాయిలో అధికారిక వేడుకలకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాన కార్యక్రమం హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించనున్నారు. వేడుకల కోసం అక్కడ ఇప్పటికే భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, భద్రతా ఏర్పాట్లు, అతిథుల సౌకర్యాల కోసం అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం పరేడ్ గ్రౌండ్స్‌లో రిహార్సల్స్ కూడా కొనసాగుతున్నాయి. ఇవాళ (ఆదివారం) మల్కాజ్‌గిరి సీపీ సుమతి పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాట్లను స్వయంగా సమీక్షించారు.
