జర్నలిస్టుల హక్కుల పరిరక్షణే టీయుడబ్ల్యూజే ధ్యేయం..
- జిల్లా అధ్యక్షుడు కాటం నాగరాజు గౌడ్
- నవాబ్‌పేట మండల టియుడబ్ల్యూజే (ఐజేయు) నూతన కార్యవర్గం ఎన్నిక
నవాబ్‌పేట, ఆంధ్రప్రభ : దశాబ్దాల కాలంగా నిర్దిష్టమైన ప్రణాళికతో జర్నలిస్టుల హక్కుల కోసం టియుడబ్ల్యూజే (ఐజేయు) రాజీలేని పోరాటం చేస్తోందని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ జిల్లా అధ్యక్షుడు కాటం నాగరాజు గౌడ్ తెలిపారు. నవాబ్‌పేట మండలంలో నిర్వహించిన యూనియన్ కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, జర్నలిస్టులకు నూతన మెంబర్‌షిప్‌లు పంపిణీ చేశారు. జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కారంలో యూనియన్ ఎల్లప్పుడూ ముందుంటుందని, నూతన ప్రతినిధులు విలేకరుల హక్కుల పరిరక్షణకు నిరంతరం శ్రమించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా నవాబ్‌పేట మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా ఆనంద్ (వార్తావేదిక), అధ్యక్షుడిగా రాఘవేంద్ర చారి (ఆంధ్రప్రభ), ఉపాధ్యక్షుడిగా శేఖర్ (వార్త), ప్రధాన కార్యదర్శిగా స్వామి (క్యూ న్యూస్), కోశాధికారిగా సూర్య నాయక్ (వే టు న్యూస్), సంయుక్త కార్యదర్శిగా భాను (బీటీ న్యూస్), జాయింట్ సెక్రెటరీగా ప్రభాకర్, కార్యవర్గ సభ్యులుగా నర్సింలు (ప్రజాతంత్ర), రవి (విజన్ ఆంధ్ర), రాహుల్ (మెట్రో న్యూస్), శంకర్ (గిరిజన సంస్కృతి)లు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి జిల్లేల రఘు, నాయకులు సీనియర్ జర్నలిస్ట్ లు రఘునాథ రావు, చంద్రశేఖర్ గౌడ్, చిక్కా వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
