Tekumatla | సీఎం దిష్టిబొమ్మ దహనం..

Tekumatla | టేకుమట్ల, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కక్ష సాధింపు చర్యతోనే సిట్ నోటీసులు ఇచ్చిందని ఆరోపిస్తూ ఆదివారం భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లి గ్రామ బస్టాండ్ ఆవరణంలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు అనవేన రమేష్, మాజీ సర్పంచ్ నేరెళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులపై కక్ష సాధింపులకు పాల్పడుతోందని అందులో భాగంగానే హరీష్ రావు, కేటీఆర్‌కు, కేసీఆర్‌కు ఫోన్ టాపింగ్ కేసులో సీట్ నోటీసులు పంపిస్తుందని విమర్శించారు.

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్‌ పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. ప్రజలను దృష్టి మళ్లించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ చిమ్మనవేన శ్రీకాంత్, వార్డ్ మెంబర్స్ జోడు పవన్, అంకల్ల మహేందర్, నేరెళ్ల శంకర్, సాంబయ్య, బచ్చల రమేష్ నేరెళ్ల చరణ్, సురేష్, సదయ్య జోడు మొండయ్య, పిప్పాల దేవేందర్, తిరుపతి, శనిగరపు పున్నం, నేరెళ్ల అరవింద్, బచ్చల ఓదెలు, కుమార్ బిఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు