గ్రామీణ జీవన విధానానికి ప్రతీక ఎద్దుల బండ్ల పరుగు పందెం పోటీలు

గ్రామీణ జీవన విధానానికి ప్రతీక ఎద్దుల బండ్ల పరుగు పందెం పోటీలు

గుంటిపల్లిలో ఎద్దులబండ్ల పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లె సింధూర , మంత్రి పల్లె

కొత్తచెరువు, ఆంధ్రప్రభ : గ్రామీణ జీవన విధానానికి సాంప్రదాయాలకు ప్రత్యేకగా నేటికీ ఎద్దుల బండ్ల పరుగు పందెం పోటీలు నిలుస్తున్నాయని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి అన్నారు.
కొత్తచెరువు మండలం గుంటిపల్లి గ్రామంలో నిర్వహించిన సాంప్రదాయ ఎద్దులబండ్ల పరుగు పోటీలను పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి లు ముఖ్య అతిథులుగా హాజరై సోమవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ముందుగా గ్రామ శివారు ప్రాంతంలో ఉన్న గంగమ్మ దేవాలయంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిలు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.

అనంతరం గ్రామస్తుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎద్దులబండ్ల పోటీల ప్రారంభ కార్యక్రమంలో కొత్తచెరువు చెందిన రైతు సాయికుమార్ ఎద్దుల బండి పోటీల్లో పాల్గొని పోటీలను జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ ,గ్రామీణ సంప్రదాయాలు, సంస్కృతి, వారసత్వాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఎద్దులబండ్ల పోటీలు గ్రామీణ జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తాయని, ఇటువంటి కార్యక్రమాలు యువతలో సంప్రదాయాల పట్ల అవగాహన పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ ,గ్రామీణ క్రీడలను, సాంప్రదాయ కార్యక్రమాలను ప్రోత్సహించడం ద్వారా మన సంస్కృతిని భావితరాలకు అందించగలమన్నారు. పోటీల నిర్వహణకు కృషి చేసిన నిర్వాహకులను అభినందించారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులుశ్రీ కాళహస్తి ఆలయ కమిటీ సభ్యులు లక్ష్మీనారాయణ, టిడిపి సీనియర్ నాయకులు రైతు సంఘం జిల్లా నాయకులు సాలక్క గారి శ్రీనివాసులు, బుక్కపట్నం చెరువు సాగునీటి సంఘం అధ్యక్షులు బసన్న గారి నవీన్ కుమార్, సహకార సొసైటీ అధ్యక్షులు హరిప్రసాద్ ,రూరల్ మండల కన్వీనర్ రామకృష్ణ, మాజీ సర్పంచ్ శివప్రసాద్ , నాగేంద్ర నాయకులు శ్రీనాథ్ సుధాకర్ ,సురేష్, నాయుడు , ,గ్రామ పెద్దలు, యువకులు, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఎద్దుల బండ్ల పరుగు పందెం పోటీలు ఆహ్లాద బరిత వాతావరణంలో ఉత్సాహంగా కొనసాగాయి. వీటిని తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ స్థాయిలో రైతులు ఈ ప్రాంతానికి విచ్చేశారు.

Leave a Reply