Siddipet | రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన తహసీల్దార్…
Siddipet | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలోని చేర్యాల తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ ) అధికారులు మెరుపుదాడి నిర్వహించి తహసీల్దార్ దిలీప్ నాయక్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం… తన భూ సమస్య పరిష్కారం కోసం ఓ రైతు తహసీల్దార్‌ను ఆశ్రయించగా, పని చేయాలంటే రూ.70 వేల లంచం ఇవ్వాలని దిలీప్ నాయక్ డిమాండ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. దీంతో బాధిత రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు ఆధారంగా పక్కా ప్రణాళిక రూపొందించిన ఏసీబీ అధికారులు, రైతు నుంచి రూ.70 వేల లంచం తీసుకుంటున్న సమయంలో తహసీల్దార్ దిలీప్ నాయక్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు, కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో చేర్యాల తహసీల్దార్ కార్యాలయంలో కలకలం నెలకొంది.
