Suspicious Death అతడెవరో…!? Andhta Prabha Crime News

Suspicious Death అతడెవరో…!? Andhta Prabha Crime News

  • తుగ్గలిలో మిస్టరీ మరణం
  • రైల్వే లైన్ సమీపంలో ఉరి
  • గుర్తు తెలియని వ్యక్తి మృతి
  • హత్యా..? ఆత్మహత్యా..? పోలీసుల దర్యాప్తు
  • ఘటన స్థలంలో ఆధారాల సేకరణ
  • అన్ని కోణాల్లో కేసు విచారణ
  • మృతుడి వివరాల కోసం పోలీసుల గాలింపు

తుగ్గలి (కర్నూలు జిల్లా) , ఆంధ్రప్రభ):

Suspicious Death కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. చెన్నంపల్లి – రామలింగాయపల్లె గ్రామాల మధ్య ఉన్న పెండేకల్–గుత్తి రైల్వే లైన్ సమీపంలో ఓ వ్యక్తి ఉరివేసుకున్న స్థితిలో కనిపించడంతో బుధవారం ఉదయం స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Suspicious Death గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు మధ్యవయస్కుడిగా కనిపిస్తున్నప్పటికీ అతని వివరాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఘటన స్థల పరిసరాలను పరిశీలించిన పోలీసులు ఆధారాలు సేకరించారు.

ప్రాథమికంగా ఇది ఆత్మహత్యగా కనిపిస్తున్నప్పటికీ, అనుమానాస్పద పరిస్థితులు ఉండటంతో అన్ని కోణాల్లో విచారణ చేపట్టినట్లు సమాచారం. వ్యక్తిని హత్య చేసి అనంతరం ఉరివేసి ఉండొచ్చనే అనుమానాలను కూడా పోలీసులు తోసిపుచ్చడం లేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Suspicious Death రైల్వే లైన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో కొంతసేపు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మృతుడి వివరాలు వెలుగులోకి వస్తే ఘటనపై మరిన్ని అంశాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

Leave a Reply