AP | రాజ్యసభ సీట్లపై ఎన్డీయే కీలక నిర్ణయం..

AP | రాజ్యసభ సీట్లపై ఎన్డీయే కీలక నిర్ణయం..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎన్డీయే సమన్వయ సమావేశంలో రాజ్యసభ సీట్ల పంపకంపై చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

కూటమి నిర్ణయం ప్రకారం నాలుగు రాజ్యసభ స్థానాల్లో మూడు సీట్లను టీడీపీకి, ఒక సీటును జనసేనకు కేటాయించినట్లు తెలుస్తోంది. అభ్యర్థుల పేర్లను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్లు ఎన్డీయే వర్గాలు వెల్లడించాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాల్గొన్నారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ రాజకీయ వ్యూహాలతో పాటు పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.

ఈ సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి. వి. ఎన్. మాధవ్,టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.

రాజ్యసభ సీట్ల కేటాయింపులో కూటమి భాగస్వామ్య పక్షాలకు ప్రాధాన్యం కల్పిస్తూ తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ముఖ్యంగా జనసేనకు ఒక రాజ్యసభ స్థానం కేటాయించడం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.

Leave a Reply