ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే రామచంద్ర నాయక్

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే రామచంద్ర నాయక్

మరిపెడ, ఆంధ్రప్రభ:

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ పిలుపునిచ్చారు.

గురువారం మున్సిపాలిటీలోని 4వ వార్డులో నిర్వహించిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పారిశుద్ధ్యం, పరిశుభ్రతపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అధికారులు పనిచేయాలని అన్నారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థవంతమైన పాలన అందిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరేష్ రెడ్డి, చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి, ఎంఈఓ అనిత రెడ్డి, వైద్యాధికారి రవి నాయక్, ఏఈ మహమూద్, వ్యవసాయ అధికారి వీరాసింగ్, శ్రీదేవి, వార్డు కౌన్సిలర్లు మెరుగు రాము, జాటోత్ సురేష్, పానుగోతు రాములు, కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ తాజుద్దీన్, గుండగాని వెంకన్న, షేక్ అఫ్జల్, భాష్పాంగు రవికాంత్, గుండగాని వేణు, గంధసిరి భిక్షపతి, చెన్నూరు మహేష్, యాకుబ్ పాషా, రాములు, రవి, అంగన్‌వాడీ, ఆర్పీ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply