రామలింగేశ్వర స్వామి వేడుకల్లో.. ఎంపీ చామల

రామలింగేశ్వర స్వామి వేడుకల్లో.. ఎంపీ చామల

మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలను పురస్కరించుకొని మంగళవారం కళ్యాణ వేడుకలకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురోహితులు పూర్ణకుంభంతో ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డికి స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో ఎంపీ స్వయంగా స్వామివారికి తలంబ్రాలు పోసి, పురోహితుల ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఎంపీ చామలని పూలమాలలు, శాలువలతో సన్మానించి, మెమోంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గుండగోని రామచంద్రు, మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నరసయ్య, వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పైల్ల సోమిరెడ్డి, జిల్లా నాయకులు గుర్రం లక్ష్మీ నరసింహ రెడ్డి, గోరుపల్లి సంతోష్ రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు ఉన్నారు.

Leave a Reply