ఏపీ, తెలంగాణలో స్టార్ హెల్త్ మెగా హెల్త్ క్యాంప్‌లు
ముందస్తు ఆరోగ్య పరీక్షలపై అవగాహన..
రెండు రాష్ట్రాల్లో 5 వేల మందికి పైగా లబ్ధి
హైదరాబాద్, ఆంధ్రప్రభ : భారతదేశంలోని ప్రముఖ స్టాండ్‌అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ తన సేవలకు 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మెగా హెల్త్ క్యాంప్‌లను నిర్వహిస్తోంది. ప్రజల్లో ముందస్తు ఆరోగ్య రక్షణ (ప్రివెంటివ్ హెల్త్‌కేర్)పై అవగాహన పెంపొందించడం, వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి సకాలంలో వైద్య సలహాలు అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని సంస్థ తెలిపింది.
ఈ కార్యక్రమం ద్వారా విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం నగరాల్లో ఇప్పటివరకు 5 వేల మందికి పైగా ప్రజలు ప్రయోజనం పొందారు. స్టార్ హెల్త్ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఈ ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నారు.
హెల్త్ క్యాంప్‌లలో బీఎంఐ, మధుమేహం, రక్తపోటు పరీక్షలు, ఈసీజీ, లిపిడ్ ప్రొఫైల్, కంటి పరీక్షలు, దంత పరీక్షలు వంటి పలు ఆరోగ్య సేవలను ఉచితంగా అందిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మెడికవర్, మ్యాక్స్ విజన్, క్లోవ్ డెంటల్, యశోద, శ్రీకర, కిమ్స్, అర్చన హాస్పిటల్స్ అండ్ ఆనంద ఇన్‌స్టిట్యూట్, మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వంటి ప్రముఖ వైద్య సంస్థల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నారు.
స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ హెడ్ శ్రీనివాస్ కేబీబీ మాట్లాడుతూ, సమాజంలో వ్యాధుల నివారణ, ముందస్తు ఆరోగ్య పరీక్షలపై అవగాహన పెంచడమే తమ లక్ష్యమన్నారు. సాధారణ ప్రజలు కూడా స్టార్ హెల్త్ కస్టమర్ యాప్ ద్వారా 24 గంటలూ ఉచిత వర్చువల్ డాక్టర్ సేవలను పొందవచ్చని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఇటువంటి వైద్య సలహాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
మెగా హెల్త్ క్యాంప్‌లతో పాటు సంస్థ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య సేవ కేంద్ర (ASK) క్లినిక్‌లను నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, కర్నూలు, తెలంగాణలో ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లో ఈ క్లినిక్‌ల ద్వారా పేద ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందిస్తున్నట్లు వెల్లడించింది.
