95. పురారాతేరంతఃపురమసితతస్త్వచ్చరణయో
స్సపర్యా మర్యాదా తరళకరణానామసులభా
తథాహ్యేతే నీతా శ్శతమఖముఖాస్సిద్ధిమతులాం
తవ ద్వారోపాంతస్థితిభిరణిమాద్యాభిరమరాః .
తాత్పర్యం: అమ్మా! జగన్మాతా! త్రిపురాసుర సంహారం చేసిన శివుడి ఇల్లాలివి! అందువలన నీ పాదపద్మపూజ చేసే భాగ్యం చపలచిత్తులయినవారికి లభించదు. అందువల్ల ఇంద్రాది దేవత లందరు నీ ద్వారం దగ్గరే నిలిచి, అక్కడ ఉన్న అణిమాదిఅష్టసిద్ధులవలన సాటిలేని ఇష్టార్థ సిద్ధులని పొందారు.
డాక్టర్ అనంత లక్ష్మీ