సౌందర్య లహరి

75. తవస్తన్యంమన్యేధరణిధరకన్యేహృదయతః
పయఃపారావారఃపరివహతి సారస్వత మివ
దయావత్యా దత్తం ద్రవిడశిశురాస్వాద్య తవ యత్
కవీనాంప్రౌఢానామజనికమనీయఃకవయితా.

తాత్పర్యం: పర్వతరాజపుత్రీ! నీ హృదయం నుండి పుట్టి, పొంగి పొరలి వచ్చే పాలసముద్ర రూపంగా నీ చనుబాలను భావిస్తాను. ఆ విధంగా కాకపోతే నీ చనుబాలను త్రాగిన ద్రావిడదేశంలో పుట్టిన బాలుడు ప్రౌఢులు,ఉద్దండులు అయిన కవీశ్వరులు అందరి కన్న మనోహరమైన కవిత్వం చెప్పగలవాడుగా ప్రసిద్ధి పొందగలుగుతాడా?

  • డాక్ట‌ర్ అనంత‌ల‌క్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *