డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు…
పాయకాపురం, ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా స్థానిక64వ డివిజన్ కండ్రికలోని టీడీపీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షుడు కె. రవికుమార్ శ్రేణుల సమక్షంలో అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ గొప్ప సామాజిక సంస్కర్త, న్యాయవాది, ఆర్థికవేత్త అంటరానితనం, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారని కొనియాడారు.
దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. ఆధునిక భారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఆయన, సమానత్వం, సామాజిక న్యాయం కోసం నిరంతరం శ్రమించారని అన్నారు. అంబేద్కర్ జీవితం సామాన్య స్థితి నుండి అత్యున్నత స్థాయికి ఎదిగిన స్ఫూర్తిదాయక ప్రస్థానం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎస్ కె బాబు, కే హర్ష సాయి, యూనిట్ ఇన్చార్జిలు కోమరి రాజేష్, లంకే నాగేశ్వరి, పొట్నూరు అప్పలనాయుడు సూర్య నారాయణ తదితరులు పాల్గొన్నారు.
చర్మకారుల చెప్పులు తయారీ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక శాంతినగర్ నందు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత కూరపాటి నాగరాజు వహించగా ముఖ్యఅతిథిగా చర్మకారుల చెప్పులు తయారీ కార్మికుల సంఘం అధ్యక్షుడు కటారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర కార్యాలయంలో కమిటీ అధ్యక్షుడు ఎస్.కే నాగుల్ మీరా మంగళవారం ఆయన కార్యాలయంలో అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
