ఉట్నూర్‌లో ఘనంగా వాజ్‌పేయి వర్ధంతి వేడుకలు..

  • చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బీజేపీ నాయకులు

ఉట్నూర్, ఆంధ్రప్రభ : మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి 8వ వర్ధంతి వేడుకలను ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు అటల్ బిహారీ వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి, ప్రజలకు ఆయన అందించిన సేవలను నాయకులు కొనియాడారు. వాజ్‌పేయి సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనకు భారతరత్న పురస్కారం అందించిందని పేర్కొన్నారు.

దేశ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఉట్నూర్ మండల అధ్యక్షుడు బింగి వెంకటేష్, ఉట్నూర్ పట్టణ అధ్యక్షుడు తన్నీరు సతీష్, జిల్లా కార్యదర్శి కొండేరి రమేష్, బీజేపీ లీగల్ సెల్ రాష్ట్ర నాయకుడు బానోత్ జగన్ నాయక్, ఓబీసీ మోర్చా ఖానాపూర్ కన్వీనర్ లింగా గౌడ్, సీనియర్ నాయకులు రమణ, ఉగ్గే విజయ్, కనక విజయ్, శ్రీను, వేణు, కైలాస్, శ్రీనివాస్, హరిప్రసాద్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.