Sensex 252.58 | లాభాల్లో స్టాక్ మార్కెట్లు
Sensex 252.58 | లాభాల్లో స్టాక్ మార్కెట్లు
Sensex 252.58 | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలపై మార్కెట్ వర్గాల్లో నెలకొన్న సానుకూల అంచనాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ, కీలక వడ్డీ రేట్లను ఆర్‌బీఐ యథాతథంగా కొనసాగించే అవకాశాలు కనిపించడంతో పెట్టుబడిదారుల్లో ఆశావహ వాతావరణం నెలకొంది.
పుంజుకున్న సూచీలు
ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే బీఎస్‌ఈ సెన్సెక్స్ 252.58 పాయింట్లు (0.34 శాతం) పెరిగి 74,612.59 వద్ద ట్రేడైంది. అదే సమయంలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ-50 సూచీ 66.50 పాయింట్లు (0.28 శాతం) లాభపడి 23,483.05 స్థాయికి చేరుకుంది. బ్యాంకింగ్, ఐటీ, ఆటో రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడం మార్కెట్‌కు ఊతమిచ్చింది.
రూపాయి స్వల్ప బలపాటు
మరోవైపు అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి స్వల్పంగా బలపడింది. డాలర్‌కు వ్యతిరేకంగా రూపాయి 85.72 వద్ద ప్రారంభమైంది. ఆర్‌బీఐ విధాన నిర్ణయాలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహం, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు తదుపరి మార్కెట్ దిశను నిర్దేశించే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
