ఎంపాగ్లిఫ్లోజిన్, దాని కాంబినేషన్ లను విడుదల చేసిన యుఎస్ వి

హైద‌రాబాద్, (ఆంధ్రప్రభ ) : టైప్ 2 మధుమేహం ఉన్నవారిలో గ్లైసెమిక్ నియంత్రణ, గుండె వైఫల్యం, దీర్ఘకాలిక మూత్రపిండ సంరక్షణ కోసం సుప్రసిద్ధ ఎస్జీఎల్టీ 2 ఇన్హిబిటార్ అయిన జెనియాను భారతీయ బహుళజాతి ఆరోగ్య సంరక్షణ సంస్థ యూఎస్ వీవిడుదల చేసింది. ఈ విడుదల రూ. 1,100 కోట్ల ఎస్జీఎల్టీ2ఐ మార్కెట్లో యుఎస్ వి ఉనికిని మరింతగా బలోపేతం చేస్తుంది. నోటి ద్వారా తీసుకునే మధుమేహ చికిత్స ఔషధాలలో దాని నాయకత్వాన్ని బలోపేతం చేస్తుంది.

ఈ ఆవిష్కరణ గురించి యుఎస్ వి మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్ తివారీ మాట్లాడుతూ… భారతదేశంలో 101 మిలియన్లకు పైగా టైప్ 2 డయాబెటిస్, 136 మిలియన్ల మంది ప్రీడయాబెటిస్‌ సమస్యలతో బాధపడుతున్నారన్నారు. జెనియాతో తాము ఈ విభాగంలో త‌మ నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ ఆధునిక డయాబెటిస్ సంరక్షణకు అవకాశాలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మెరుగైన రోగి ఫలితాల కోసం సరసమైన, అధిక-నాణ్యత చికిత్సలను అందించడానికి యుఎస్ వి కట్టుబడి ఉందన్నారు.

Leave a Reply