Mandali Buddha Prasad | భూమి పూజ..

Mandali Buddha Prasad | భూమి పూజ..

Mandali Buddha Prasad, నాగాయలంక, ఆంధ్రప్రభ : సహకార సంఘాలు తక్షణ కర్తవ్యం నెరవేర్చాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్పష్టం చేశారు. బుధవారం నాగాయలంకలో పీఏసీఎస్ నూతన కార్యాలయం, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్ విచ్చేసి సహకార సంఘ భవన సముదాయ నిర్మాణానికి భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ రెండు రోజులు కష్టపడి ధాన్యం మొత్తం మిల్లులకు చేర్చేలా శ్రద్ధ వహించాలని సహకార సంఘాల ప్రతినిధులకు, ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బందికి సూచించారు. రైతులు తమ ధాన్యం ఆరబెట్టుకున్న సమయంలో చినుకు పడితే రైతులు నష్టపోయే పరిస్థితి ఎదురుకాకుండా, సహకార సంఘాలు ప్రముఖమైన పాత్ర పోషించి, రైతులకు న్యాయం చేయాలని కోరారు. ధాన్యం తరలింపు వేగవంతం చేసేందుకు సహకార సంఘాలు ముఖ్యమైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్ మాట్లాడుతూ.. బ్యాంకు పరిధిలో సహకార సంఘాలను ప్రక్షాళన చేసి బలోపేతం చేసేందుకు కూటమి (Kutami) ప్రభుత్వం సహకారంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. పీఏసీఎస్ చైర్మన్ ముమ్మారెడ్డి శ్రీనివాసరావు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply