మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి సీతక్క

మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి సీతక్క

తాడ్వాయి, ఆంధ్రప్రభ:

మండలంలోని మృతుల కుటుంబాలను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదివారం పరామర్శించి భరోసా ఇచ్చారు. తాడ్వాయి మండలం మేడారం గ్రామానికి చెందిన కుర్శం అశోక్ కుమారుడు కుర్శం హర్షవర్ధన్ రెండు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, మంత్రి సీతక్క వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదేవిధంగా కొత్తూరు గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు జాలిగపు జంపన్న, కుమార్ నానమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, వారి కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు.

తాడ్వాయి మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ గజ్జల రాజశేఖర్‌కు ఇటీవల సర్జరీ జరగగా, ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, పంచాయతీరాజ్ స్టేట్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ పల్లె జైపాల్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న, తాడ్వాయి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొల్లు దేవేందర్, ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.

Leave a Reply