Ootkur | వివేకానందుడి స్ఫూర్తితో ముందుకు సాగాలి

Ootkur | వివేకానందుడి స్ఫూర్తితో ముందుకు సాగాలి

  • దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన వివేకానందుడు
  • రక్తదాతలే నిజమైన ప్రాణదాతలు

Ootkur | ఊట్కూర్, ఆంధ్రప్రభ : స్వామి వివేకానందుడి స్ఫూర్తితో యువత, విద్యార్థులు ముందుకు సాగాలని ఉమ్మడి మహబూబ్ నగర్ జెడ్పి మాజీ వైస్ చైర్మన్ గరిడినింగిరెడ్డి, మాజీ జెడ్పిటిసి అరవింద్ కుమార్, మాజీ సర్పంచ్ భాస్కర్, ఉప సర్పంచ్ రమేష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఎం.భరత్ అన్నారు. స్వామి వివేకానందుడి బోధనలు ప్రతి ఒక్కరికి మార్గదర్శకమని అన్నారు.

ఈ రోజు నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… చికాగో మహానగరంలో భారత దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన మహనీయుడు వివేకానందుడనికొనియాడారు.

రక్తదాతలే నిజమైన ప్రాణదాతులని యువత విరివిగా రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఏబీవీపీ చేపట్టే వివిధ సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనిఅన్నారు. ప్రతి ఒక్కరూ దేశభక్తి దైవభక్తి పెంపొందించుకోవాలనిఅన్నారు. యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సేవాభావాన్ని పెంపొందించడంలో స్వామి వివేకానంద బోధనలు మార్గదర్శకమని అన్నారు.

యువత లక్ష్యసాధనలో పట్టుదలతో ముందుకు సాగాలని, సమాజ సేవను తమ జీవిత లక్ష్యంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. వివేకానందుని ఆలోచనలు నేటి యువతకు దిశానిర్దేశకమని, విద్య, క్రీడలు, సేవా కార్యక్రమాల ద్వారా సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలనిఅన్నారు. 30 మంది యువకులు రక్తదానం చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు రాధాకృష్ణయ్య గౌడ్,హన్మంతు, మాజీ ఉపసర్పంచ్ గోపాల్,ఏబీవీపీ పూర్వ విద్యార్థి ఎం భరత్, నగర అధ్యక్షులు శివశంకర్, కార్యదర్శి అభిషేక్, అంబేద్కర్ సంఘం మాజీ అధ్యక్షులు దశరథ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply