Starlink | భారత్‌లో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు గ్రీన్ సిగ్నల్ !

భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు మరో కీలక అడుగు పడింది. ఎలాన్ మస్క్ సారథ్యంలో నడుస్తున్న స్టార్‌లింక్ సంస్థకు భారత ప్రభుత్వం నుంచి GMPCS (గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్) లైసెన్స్‌ మంజూరయ్యింది. దీనివల్ల దేశంలో స్టార్‌లింక్ సేవలు ప్రారంభానికి బలమైన ప్రోత్సాహాన్ని ఇచ్చింది.

స్టార్‌లింక్ మూడోది!

ఇప్పటికే ఈ లైసెన్స్‌ను వన్‌వెబ్ (భారత కంపెనీ), జియో శాటికామ్ (రిలయన్స్ జియో అనుబంధ సంస్థ) పొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు స్టార్‌లింక్ మూడవ కంపెనీగా ఈ జాబితాలో చేరింది. ప్రస్తుతం స్టార్‌లింక్ ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా దేశాల్లో సేవలందిస్తోంది.

లో ఎర్త్ ఆర్బిట్‌లో 6000 శాటిలైట్‌లను వాడుతూ, భూమికి కేవలం 550 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తూ ఇంటర్నెట్ అందిస్తోంది. మొత్తంగా చూసుకుంటే, భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ విప్లవానికి మార్గం సుగమమవుతోంది.

స్పేస్‌ఎక్స్‌తో జియో, ఎయిర్‌టెల్ ఒప్పందం !

మొదట్లో పోటీగా కనిపించినా… ఇప్పుడు జియో, ఎయిర్‌టెల్ సంస్థలు కూడా స్పేస్‌ఎక్స్‌ (స్టార్‌లింక్ మాతృసంస్థ) తో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. మార్చి 2025లో ఈ ఒప్పందాలు జరగడం గమనార్హం. భవిష్యత్తులో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల కోసం పరస్పరం సహకారం అందించనున్నారు.

రూ.840కే అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్?

ఇటీవళ స్టార్‌లింక్ భారత్‌లో తమ డేటా ప్లాన్‌ వివరాలు లీక్ అయ్యాయి. అందుబాటులోకి రానున్న ప్లాన్ ప్రకారం, నెలకు రూ.840 చెల్లిస్తే అన్‌లిమిటెడ్ డేటా వినియోగించవచ్చని సమాచారం. తక్కువ ధరలో వేగవంతమైన ఇంటర్నెట్ అందించడమే లక్ష్యంగా స్టార్‌లింక్ వ్యూహాన్ని రూపొందిస్తోంది.

ఈ సేవలతో 10 మిలియన్ల (1 కోటి) వినియోగదారులను త్వరగా ఆకట్టుకోవాలని సంస్థ భావిస్తోంది. అయితే, నెలవారీ ప్లాన్ తక్కువైనా, ప్రారంభానికి అవసరమైన హార్డ్‌వేర్ కిట్ ధర మాత్రం ఎక్కువగానే ఉన్న‌ట్టు తెలుస్తోంది. దీని ధర అమెరికా డాలర్లలో $250 నుండి $380 వరకూ ఉండే అవకాశం ఉంది. అంటే భారత కరెన్సీలో రూ.21,300 నుంచి రూ.32,400 వరకు ఖర్చవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *