మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి సేఫ్టీ కిట్ల పంపిణీ
పారిశుద్ధ్య కార్మికుల భద్రతకు ప్రాధాన్యత
హెల్మెట్లు, రెయిన్‌కోట్లు, భద్రతా షూస్, అప్రాన్‌లు, గ్లౌజుల అందజేత
భూపాలపల్లి టౌన్, ఆంధ్రప్రభ : పారిశుద్ధ్య కార్మికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ భూపాలపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సేఫ్టీ కిట్లను పంపిణీ చేశారు.
పురపాలక సంఘ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, మున్సిపల్ కమిషనర్ ఉదయ్‌కుమార్, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్‌తో పాటు కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి హెల్మెట్లు, రెయిన్‌కోట్లు, భద్రతా షూస్, అప్రాన్‌లు, గ్లౌజులను అందజేశారు.
వర్షాకాలంలోనూ, ప్రమాదకర పరిస్థితుల్లోనూ విధులు నిర్వహించే పారిశుద్ధ్య కార్మికుల భద్రత దృష్ట్యా ఈ సేఫ్టీ సామగ్రి ఉపయోగపడుతుందని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.
కార్మికులు తప్పనిసరిగా సేఫ్టీ కిట్లను వినియోగిస్తూ విధులు నిర్వర్తించాలని సూచించారు.
కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.
