రూ.50 లక్షలతో డ్రైనేజీ కాలువల పనులు ప్రారంభం
రాజీవ్ చౌక్ నుంచి పాత శిశు మందిర్ వరకు పనులు
వర్షాకాలంలో నీరు నిలవకుండా చర్యలు
క్యాతన్‌పల్లి, ఆంధ్రప్రభ : నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా రూ.50 లక్షల నిధులతో డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులను శుక్రవారం ప్రారంభించారు.
బి జోన్ రాజీవ్ చౌక్ నుంచి పాత శిశు మందిర్ వరకు చేపట్టనున్న ఈ పనులు మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు ప్రారంభమైనట్లు తెలిపారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ కూతురు ప్రభాకర్ మాట్లాడుతూ.. వర్షాకాలంలో రోడ్లపై నీరు నిలవకుండా, పరిసరాల పరిశుభ్రతను మెరుగుపరిచేందుకు డ్రైనేజీ కాలువలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.
నగరాన్ని మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మరిన్ని పనులు చేపడతామని అన్నారు.
సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, మంత్రి వివేక్ వెంకటస్వామి సూచనల మేరకు అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సంధ్యారాణి, వైస్ చైర్‌పర్సన్ మిట్టపల్లి సరిత, మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, ఏఈ ఆశ్రిత్, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
