Rs.93 crore | ప్రగతికి పన్నులే పునాది

Rs.93 crore | ప్రగతికి పన్నులే పునాది

  • బకాయిలపై ఉదాసీనత తగదు
  • కర్నూలు కమిషనర్ పి.విశ్వనాథ్.

Rs.93 crore | కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో : నగరాభివృద్ధికి పన్నులే ప్రధాన ఆధారమని, వాటిని రాబట్టడంలో ఉదాసీనత వైఖరి తగదని కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్(Commissioner P. Vishwanath) స్పష్టం చేశారు. మంగళవారం నగరపాలక కార్యాలయంలో రెవెన్యూ విభాగ సిబ్బందితో పన్ను వసూళ్ల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.

నగరపాలకకు రూ.93 కోట్ల(Rs.93 crore) ఆస్తి‌ పన్నులు, 14.78 కోట్ల తాగునీటి కొళాయి చార్జీల బకాయిలు రావాల్సి ఉన్నాయని, అందులో మొండి బకాయిలే అధికంగా ఉండటం సరైన పద్దతి కాదన్నారు. వెంటనే మొండి బకాయిదారుల(bad debtors)కు నోటిసులు జారీ చేయాలని, ఇప్పటికే జారీ చేసిఉంటే దుకాణాలను సీజ్ చేయాలని ఆదేశించారు.

నగరం ప్రగతి పథంలో నడవాలంటే పన్నులే కీలకమని, ప్రజలే స్వచ్ఛందంగా పన్నులను చెల్లించి నగరాభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్‌ఓలు జునైద్, స్వర్ణలత, వాజిద్, ఆర్‌ఐలు, పాల్గొన్నారు.

Leave a Reply