Rs. 6 thousand crores | విద్యా విధానంలో మార్పులకు శ్రీకారం

Rs. 6 thousand crores | విద్యా విధానంలో మార్పులకు శ్రీకారం
కార్పొరేట్‌కు దీటుగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు
నర్సింహులపేట పీఎం శ్రీ పాఠశాలను తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా ఎంపిక
Rs. 6 thousand crores | నర్సింహులపేట, ఆంధ్రప్రభ: ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడ్జెట్లో రూ.6 వేల కోట్లను కేటాయించి అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు తీసుకువచ్చారు. ఒకే రాష్ట్రం.. ఓకే యూనిఫామ్.. అందించి విద్యావ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టబోపోతున్నారు. వినూత్న విద్యా విధానం అమలులో భాగంగా కార్పొరేట్ స్థాయికి దీటుగా ప్రభుత్వ పాఠశాలల బలంపేతం చేసే దిశగా రాష్ట్రంలోని నియోజకవర్గానికి ఒకటి చొప్పున తెలంగాణ పబ్లిక్ స్కూల్ గా ఏర్పాటు చేసి ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభానికి శ్రీకారం చుడుతున్నారు.
Rs. 6 thousand crores | పైలెట్ ప్రాజెక్టుగా..
దీంట్లో మొదటగా పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో ఉన్న పాఠశాలను తెలంగాణ పబ్లిక్ స్కూల్ గా తీర్చిదిద్దుతున్నారు. అందులో భాగంగానే మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పీఎం శ్రీ పాఠశాలను తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా ఎంపిక చేశారు.
Rs. 6 thousand crores | తెలంగాణ పబ్లిక్ స్కూల్లో మెరుగైన వసతులు
4 నుంచి 6 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉన్న పాఠశాలలో 30 మంది కమిటీల్లో ఒక హెచ్ ఓఎస్ గా పేరెంట్స్ కమిటీ వేస్తున్నారు. క్రీడలు, క్రాఫ్ట్స్, సంగీతం డాన్స్ లైబ్రరీ రూమ్స్ లను ఏర్పాటుతో పాటు మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చే విద్యార్థుల కొరకు బస్సులు కేటాయించి రవాణా సౌకర్యం కల్పించబోతున్నారు. ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే చోట ఇంగ్లిషులో బోధిస్తారు. సెమీ రెసిడెన్షిప్ తరహా బోధన,విద్యార్థులు ఉదయం రాగానే స్నాక్స్ తో పాటు అల్పాహారం మధ్యాహ్న భోజనం సాయంత్రం స్నాక్స్ ను అందించబోతున్నారు.
Rs. 6 thousand crores | బడిబాట కార్యక్రమం ప్రారంభం.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటు వంటి స్కూళ్లలో నేటి నుంచి బడిబాట కార్యక్రమాన్ని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రారంభించి ర్యాలీ నిర్వహిస్తూ ఇంటింటికి తిరుగుతున్నారు. జూన్12న పాఠశాలలు ప్రారంభమైన తర్వాత వారం రోజుల వరకు కార్యక్రమాలు నిర్వహించి పుస్తకాలు,యూనిఫామ్ లు పంపిణీ చేయనున్నారు. జూన్ 19 వరకు నిర్వహించి అడ్మిషన్లను పెంచే విధంగా కృషి చేయాలని ప్రభుత్వం సూచిస్తుంది. కాగా,తెలంగాణ పబ్లిక్ స్కూల్లో పిల్లలను చేర్చాలని జిల్లా విద్యాధికారి సత్యనారాయణ మూర్తి తల్లితండ్రులకు విజ్ఞప్తి చేశారు.
CLICK HERE TO READ MORE : Traffic Rules | ట్రాఫిక్ నియంత్రణకు.. నయా రూల్స్
