Rs 4.50 lakh | 108 సిబ్బంది నిజాయితీ

Rs 4.50 lakh | 108 సిబ్బంది నిజాయితీ
- 4.50 లక్షలు కుటుంబ సభ్యులకు అందజేత
Rs 4.50 lakh | తలుపుల, ఆంధ్రప్రభ : 108 సిబ్బంది(108 staff) నిజాయితీ చాటుకుంది. మృతుడి వద్ద ఉన్న 4.50 వేలు పోలీసుల సమక్షంలో కుటుంబ సభ్యులకు అందజేశారు. రాజగోపాల్ శెట్టి (65 ) వ్యాపారం నిమిత్తం పులివెందుల నుంచి బెంగళూరుకు వెళుతుండగా మార్గమధ్యంలో బట్రేపల్లి వద్ద భోజనం కోసం దిగారు. ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలారు.
విషయం చుట్టుపక్కల వాళ్ళు 108కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ బట్రపల్లికి చేరుకొని కదిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు సిబ్బంది తెలిపారు. మృతిని వద్ద నగదు రూ 4.50 వేలు(Rs 4.50 thousand) ఉండగా ఈ విషయాన్ని అంబులెన్స్ సిబ్బంది గమనించారు.
ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఖలధర్, పైలట్ రత్నం స్థానిక అర్బన్ పోలీస్ స్టేషన్ కు చేరుకొని సీఐ నారాయణరెడ్డి సమక్షంలో మృతిని కుమారుడు ఉపేంద్రకు నగదు అందజేశారు. నిజాయితీ చాటుకున్న 108 సిబ్బందికి పలువురు అభినందించారు.
