ప్రజాధనం వృథా చేయ‌ను

ప్రజాధనం వృథా చేయ‌ను

ప్ర‌జ‌ల సోమ్మును దోచుకోను
అక‌లి క‌ష్టాలు తెలిసిన వాడిని
అంద‌రికీ న్యాయం చేసేందుకు కృషి చేస్తా
ఉద్వేగంగా విజ‌య్ తొలి ప్ర‌సంగం
తొలిరోజునే ఉచిత విద్య‌, మ‌హిళా భ‌ద్ర‌త‌, డ్ర‌గ్స్ నిరోధం ఫైళ్ల‌పై సంత‌కం
విజ‌య్ కేబినెట్‌లో ఏడుగురు టీవీకే ఇద్ద‌రు కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌కు చోటు

చెన్నై, ఆంధ్ర‌ప్ర‌భ : తన జీవితంలో చాలా కష్టాలు అనుభవించాన‌ని.. ఆకలి బాధలు అంటే ఏంటో తనకు తెలుసని త‌మిళనాడు కొత్త ముఖ్య‌మంత్రి విజ‌య్ అన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధినేత తొలిసారిగా సభను ఉద్దేశించి ప్రసంగించారు. తనను అభిమానంగా పిలిచారు కాబట్టే రాజకీయాల్లోకి వచ్చానని ఈ సందర్భంగా వెల్ల‌డించారు. ‘‘నేను మీ కుటుంబ సభ్యుడి లాంటి వాడిని. సినిమాల్లో నన్ను ఉన్నతస్థాయిలో నిలిపారు. తమ్ముడూ రా.. అంటూ పిలిచారు కాబట్టే రాజకీయాల్లోకి వచ్చాను. నా ప్రయాణంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా. ఇది మీ ప్రభుత్వం.. డ్రగ్స్‌పై ఈ రోజు నుంచే పోరాటం ప్రారంభం’’ అని సీఎం విజయ్ అన్నారు.

రూ.10 ల‌క్ష‌ల కోట్ల అప్పు..

ప్రస్తుతం.. తమిళనాడు ప్రభుత్వం ₹10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని విజయ్ తన ప్రసంగం ద్వారా వెల్లడించారు. గత ప్రభుత్వం ఖజానా మొత్తం ఖాళీ చేసిందని.. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని తెలిపారు. ఏది సాధ్యమో అది మాత్రమే చేస్తామని.. అనుకున్న లక్ష్యాలను సాధిస్తామని ముఖ్యమంత్రి విజయ్​ వివరించారు. ‘దిస్ ఈజ్ న్యూ బిగినింగ్. ప్రజా ధనాన్ని వృథా చేయను.. దోచుకోను. టీవీకేలో ఒకే ఒక అధికార కేంద్రం ఉంది.. అది విజయ్ మాత్రమే. నేను పవర్ సెంటర్.. మరో పవర్ సెంటర్ ఉండదు.. ఉండబోదు. మైనారిటీ ప్రజలకు, విద్యార్థుల భవిష్యత్తుకు అండగా ఉంటా. కార్యకర్తల వల్లే ఈ విజయం సాధ్యమైంది. వారికి రుణపడి ఉంటా. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మిత్రువులైనా, శత్రువులైనా.. అందరికీ ఒకే చట్టం’’ అని విజయ్ అన్నారు.

ఉచిత విద్య‌, మ‌హిళా భ‌ద్ర‌త ఫైళ్ల‌పై తొలి సంత‌కాలు..

సీఎంగా విజయ్​ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అతి ముఖ్యమైన మూడు కీలక కార్యక్రమాలపై సంతకాలు చేశారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేశారు. మహిళా భద్రతపై రెండో సంతకం చేశారు. దీని ద్వారా మహిళల భద్రత కోసం షీటీమ్స్ తరహాలో ప్రత్యేక నిఘా విభాగం ఏర్పాటు చేయనున్నారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఈగల్ తరహా వ్యవస్థపై విజయ్ మూడో సంతకం చేశారు.

తొమ్మిదిమంది మంత్రులు.. శాఖ‌లు..

టీవీకే అధినేత విజయ్‌తో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. పలువురు మంత్రుల శాఖలు కూడా ఖరారయ్యాయి. మొత్తం 9 మంది మంత్రులలో ఏడుగురు తమిళగ వెట్రి కళగం పార్టీకి చెందిన వారు కాగా, ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

సీఎం విజయ్‌ – హోం, ప్రజాపాలన శాఖలు
ఆధవ అర్జున్‌ – క్రీడలు, ఎక్సైజ్ శాఖ
సెంగొట్టాయన్‌ – పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్
వెంకట్రామన్‌ – పాఠశాల విద్యాశాఖ
ఎన్‌. ఆనంద్‌ – మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్
నిర్మల్ కుమార్‌ – విద్యుత్ శాఖ
రాజమోహన్‌ – ఆదిద్రవిడ సంక్షేమ శాఖ
అరుణ్ రాజ్‌ – కమర్షియల్ ట్యాక్సెస్, రిజిస్ట్రేషన్
కీర్తన, టీకే ప్రభు‌కు శాఖలు కేటాయించాల్సి ఉంది.

CLICK HERE TO READ MORE : ఐదు రాష్ట్రాల‌ ఎన్నిక‌ల్లో పెరిగిన ఓటు బ్యాంకు

CLICK HERE TO READ MORE

Leave a Reply