పెండెల రవీందర్‌ను పరామర్శించిన చల్లా
పరకాల ఆంధ్రప్రభ: పరకాల మండలం వెల్లంపల్లి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు పెండెల రవీందర్ కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సోమవారం ఆయనను పరామర్శించారు.
ఈ సందర్భంగా రవీందర్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చల్లా ధర్మారెడ్డితో పాటు పలువురు బీఆర్‌ఎస్ నాయకులు రవీందర్‌ను పరామర్శించారు.
