Revanth Reddy | బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం

Revanth Reddy | బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం

Revanth Reddy | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఓఆర్ఆర్ లాగే…ఆర్ఆర్ఆర్ ను పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. వికారాబాద్‌లోని పరిగిలో నిర్వహించిన ‘ప్రజా పాలన-ప్రగతి బాట’ సభలో సీఎం మాట్లాడారు. స్థానిక సమస్యలు పరిష్కరించేందుకు బీఆర్ఎస్, బీజేపీ ప్రయత్నించలేదన్నారు. ఓట్లు కావాలి కానీ, ప్రజల సమస్యలను ఏనాడైనా పట్టించుకున్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకున్నాయని విమర్శించారు. వికారాబాద్ ను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా చేస్తామన్నారు. రంగారెడ్డికి గోదావరి నీళ్లు ఇవ్వాలన్న ఆలోచన కేసీఆర్ చేయలేదన్నారు. గోదావరి జలాలు 300టీఎంసీలు ఇస్తే 30లక్షల ఎకరాలు పారేవన్నారు. తాగునీటికి అల్లాడుతున్నామంటే అది మీ పాపం కాదా..? అని ప్ర‌శ్నించారు. రంగారెడ్డి జిల్లాకు గోదావ‌రి జ‌లాలు రాకుండా కేసీఆర్ అడ్డుకున్నార‌ని సీఎం రేవంత్ అన్నారు.

Leave a Reply