ఆట వస్తువులు వెంటనే మరమ్మతు చేయాలి..

తిరుపతి, ఆంధ్రప్రభ : నగరపాలక సంస్థ పరిధిలోని వినాయక సాగర్ లో పాడైన ఆట వస్తువులను వెంటనే మరమ్మతులు చేసి పిల్లలకు అందుబాటులోకి తేవాలని ఇంచార్జి కమిషనర్ శారదా దేవి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం నగరంలోని రైతు బజార్, న్యూ మారుతి నగర్, రాయల్ నగర్, వినాయక సాగర్ తదితర ప్రాంతాల్లో పారిశుధ్థ్య పనులతో పాటు ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తులను పరిశీలించారు. నగరంలో పారిశుధ్థ్య పనులను మరింత మెరుగ్గా చేపట్టాలని సూచించారు.

ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. వినాయక సాగర్ పరిశీలించి ఓపెన్ జిమ్, ఆట వస్తువులు మరమ్మత్తు చేయాలని అధికారులను ఆదేశించారు. స్విమ్మింగ్ పూల్ ను నిబంధనల మేరకు నిర్వహణ చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. మురుగునీటి శుద్ధి చేసే ప్లాంట్ ను మరింత బాగా నిర్వహించాలని నిర్వాహకులను ఆదేశించారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య, ఏసీపీ పార్వతి ప్రియ, డీఈ రమణ, శానిటేషన్ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి తదితరులు ఉన్నారు.

Leave a Reply