ఎమ్మెల్యే ఆరణి జనవాణికి 54 వినతులు

ఎమ్మెల్యే ఆరణి జనవాణికి 54 వినతులు

తిరుపతి ప్రెస్ క్లబ్, ఆంధ్రప్రభ : జనసేన పార్టీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నిర్వహించిన జనవాణి కి 54 వినతులు అందాయి. శనివారం ఉదయం తన కార్యాలయంలో జనవాణి నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు దృష్టికి తీసుకొచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు రెండు, సహాయ కమిషనర్ కు 12, ఎస్ ఈ కి 12, ప్రణాళిక విభాగానికి 4, ఆరోగ్య అధికారికి 3, హౌసింగ్ కు 7, టీటీడీకి సంబంధించి 7, తహసిల్దార్ కు సంబంధించి 3, కలెక్టర్ కు ఒకటి, వెటర్నరీ జేడీ కి ఒకటి, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ కు ఒకటి, రుయా ఆస్పత్రి సూపరిండెంట్ కు ఒకటి, నారాయణ స్కూల్ ఏజిఎం కు ఒక వినతి పత్రం వచ్చాయి.

ఈ వివతి పత్రాలను శాఖల వారీగా విభజించి సంబంధిత అధికారులకు పంపినట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. సమస్యలను నేరుగా తెలుసుకుని అధికారులకు వాటిని చేర్చి పరిస్కరించడమే లక్ష్యంగా జనవాణి నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆర్ ఓ రవి, డిఈ మహేష్, ఎస్పీ డీసీఎల్ ఏఈ ఉమాపతి, జనసేన నగర అధ్యక్షులు రాజా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply