వాహనదారులకు ఊరట..
- చీమలపాడు జంక్షన్ లో ప్యాచ్ వర్క్
- ఎమ్మెల్యే కొలికపూడి ఆదేశాలతో స్పందించిన ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు
ఏ కొండూరు, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని చీమలపాడు జంక్షన్ వద్ద జాతీయ రహదారి-30పై ఏర్పడిన భారీ గుంతకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు జోక్యంతో తక్షణ మరమ్మతులు చేపట్టారు. రహదారిపై భారీ గుంత కారణంగా వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని స్థానికులు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు దృష్టికి తీసుకురాగా, ఆయన వెంటనే జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులతో మాట్లాడి అత్యవసరంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు స్పందించిన ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు చీమలపాడు జంక్షన్ వద్ద మరమ్మతు పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభించారు. పనులు నాణ్యతతో, వేగంగా పూర్తయ్యేలా ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు స్వయంగా పర్యవేక్షిస్తూ సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రహదారి భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ వెంటనే చర్యలు తీసుకున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు స్థానిక ప్రజలు, వాహనదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు, వాహనదారులు పాల్గొన్నారు.
