పోలీసు స్టేషన్‌లలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం…

పోలీసు స్టేషన్‌లలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం…

విస్తృత శుభ్రత కార్యక్రమాలు నిర్వహించిన పల్నాడు జిల్లా పోలీసులు

నరసరావుపేట, ఆంధ్రప్రభ : జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాల మేరకు జిల్లాలోని అన్నీ పోలీస్ స్టేషన్ లలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీస్ అధికారులు, సిబ్బంది కలిసి పోలీస్ స్టేషన్ లలోని గదులు, టేబుళ్లు, ర్యాకులు, రికార్డులు, ఇతర సామగ్రిని శుభ్రపరిచారు. స్టేషన్ పరిసరాలను స్వచ్ఛంగా ఉంచేందుకు ఊడ్చి పరిశుభ్రత పనులు చేపట్టారు. పాత రికార్డులను క్రమబద్ధీకరించడం, అవసరం లేని వ్యర్థ పదార్థాలను తొలగించడం, ఫైల్స్‌ను సక్రమంగా అమర్చడం వంటి చర్యలు చేపట్టారు.

పోలీస్ స్టేషన్ లలో శుభ్రతతో పాటు భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడం కోసం ఎలక్ట్రికల్ వ్యవస్థలు, ఫైర్ సేఫ్టీ పరికరాలను కూడా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ పరిశుభ్రమైన వాతావరణం పని సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు దోహదపడుతుందని తెలిపారు. పోలీస్ స్టేషన్ లు ప్రజలు నిత్యం సందర్శించే ప్రదేశాలు కాబట్టి వాటిని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

అదేవిధంగా స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం రాష్ట్ర అభివృద్ధికి కీలకమని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధించడంలో పోలీస్ శాఖ సైతం చురుకుగా పాల్గొంటుందని, భవిష్యత్తులో శుభ్రత కార్యక్రమాలను నిర్వహిస్తూ, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, హరిత కార్యక్రమాలను ప్రోత్సహించడం వంటి చర్యలను కూడా కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్నీ పోలీస్ స్టేషన్ ల సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply