TG | వెద‌ర్ డిపార్ట్‌మెంట్ వెల్ల‌డి..

TG | వెద‌ర్ డిపార్ట్‌మెంట్ వెల్ల‌డి..

TG | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ర్టంలోని ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షం ప‌డే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. హైద‌రాబాద్ తోపాటు ప‌లు జిల్లాల్లో ఆకాశం మేఘావృత‌మైంద‌ని, మ‌రికొద్దిసేప‌ట్లో వాన ప‌డ‌నుంద‌ని అధికారులు సూచించారు. న‌గ‌రంలోని మ‌ల‌క్‌పేట్‌, నాంప‌ల్లి, ఆబిడ్స్‌, హిమాయ‌త్ న‌గ‌ర్‌, ఖైర‌తాబాద్‌, చార్మినార్‌, అల్వాల్‌, కాప్రా, సికింద్రాబాద్ ప్రాంతాల్లో మ‌రో రెండు గంట‌ల్లో వాన కుర‌వ‌నుంది. అలాగే రంగారెడ్డి, కామారెడ్డి, జ‌గిత్యాల, సిరిసిల్ల‌, నిజామాబాద్‌, నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాల్లో వ‌ర్షం కురిసే చాన్స్ ఉంది.

Leave a Reply