అవినీతి ఆరోపణలు.. విద్యుత్ ఏఎల్ఎం సస్పెన్షన్

నరసరావుపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట మండలం పెదపాలెం, మిట్టపాలెం గ్రామాల విద్యుత్ ఏఎల్ఎంగా పనిచేస్తున్న షేక్ జాన్వలిని అధికారులు సస్పెండ్ చేశారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం రైతుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేయడం, బిల్లుల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఫిర్యాదులు రావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఇటీవల నిర్వహించిన ప్రజా కార్యక్రమంలో పలువురు రైతులు ఎమ్మెల్యే ప్రవీణ్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

Leave a Reply