Charan Vs Dhanush | నిజంగానే పోటీపడనున్నారా…?

Charan Vs Dhanush | నిజంగానే పోటీపడనున్నారా…?
Charan Vs Dhanush |పెద్దితో పోటీకి కర.. నిజంగానే బాక్సాఫీస్ క్లాష్?
డబ్బింగ్ స్టార్ట్.. వాయిదా డౌట్స్ క్లియర్!
అసురన్, కర్ణన్ రేంజ్ మూవీనా?
తెలుగులో ప్రభావం ఎంత?
తమిళనాడు, కేరళలో అసలు పోటీ అక్కడే!
మెగా ఫ్యాన్స్ ఆశలు నెరవేరుతాయా?
Charan Vs Dhanush | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : గ్లోబల్ స్టార్ (Global Star) రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ పెద్ది. ఈ సినిమాని బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నారు. మార్చి 27న రావాల్సిన పెద్ది సినిమా ఏప్రిల్ 30కి వాయిదాపడిన విషయం తెలిసిందే. అయితే.. మే 1న రావాలి అనుకున్న అఖిల్ లెనిన్ పెద్దితో పోటీ ఎందుకు అని పోస్ట్ పోన్ అయ్యింది. అయితే.. ఇప్పుడు పెద్దితో పోటీకి ఓ స్టార్ సై అంటున్నారు. ఇంతకీ.. పెద్దితో పోటీకి సై అంటున్న స్టార్ ఎవరు… ఆ మూవీ ఏంటి..?

Charan Vs Dhanush | పెద్దికి పోటీకి కర..
పెద్ది సినిమా ఏప్రిల్ 30న రిలీజ్ అని అనౌన్స్ చేసిన తర్వాత కూడా పోస్ట్ పోన్ తప్పదు అంటూ ప్రచారం జరిగింది. మేకర్స్ మాత్రం ప్రచారంలో ఉన్న వార్తల పై రియాక్ట్ అవ్వలేదు. దీంతో పెద్ది మరోసారి వాయిదా పడనుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే.. డబ్బింగ్ స్టార్ట్ చేయడంతో ఆ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి. ఇప్పుడు పెద్దితో పోటీకి ధనుష్ (Dhanush) రాబోతున్నాడు. అవును.. ధనుష్ నటించిన మూవీ కర. ఈ సినిమాని ఏప్రిల్ 30న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీనికి విఘ్నేష్ రాజా డైరెక్టర్. ఈ మూవీ కూడా రా అండ్ రస్టిక్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతోన్న సినిమానే.

Charan Vs Dhanush | అసురన్, కర్ణన్ రేంజ్ లో..
ఈ సినిమాలో ధనుష్ కి జంటగా మలయాళ బ్యూటీ మమిత బైజు నటిస్తుంది. అలాగే శరత్ కుమార్, జయరాజ్ లాంటి పెద్ద క్యాస్టింగే ఉంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా (Movie) అసురన్, కర్ణన్ రేంజ్ లో ఉంటుందని.. ఆడియన్స్ ని ఆకట్టుకోవడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది. అలాగే రిలీజ్ కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారు. అయితే.. కర సినిమా విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే.. తెలుగులో ధనుష్ మార్కెట్ డౌన్ అవుతోంది. సార్, సూపర్ హిట్ అయ్యింది కానీ.. రాయన్ కి మాత్రం చెప్పుకోదగ్గ రిజెల్ట్ రాలేదు.

Charan Vs Dhanush | తమిళనాడు, కేరళలో..
ధనుష్ ఇడ్లీ కొట్టు మూవీ దారుణంగా పోయింది. ఇక ధనుష్ డైరెక్ట్ చేసిన జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమా కూడా జస్ట్ యావరేజ్ అనిపించింది. అందువలన కర సినిమా వలన తెలుగు (Telugu) రాష్ట్రాల్లో పెద్దగా ఇబ్బంది ఉండదు. అయితే.. తమిళనాడు, కేరళ రాష్ట్రాల థియేటర్స్ లో ధనుష్ కర సినిమా ప్రభావం వలన పెద్ది సినిమాకి కొంత కోత పడుతుంది. అయితే.. పోటీ ఎలా ఉన్నా ఈసారి వాయిదాపడకుండా చరణ్ పెద్ది సినిమా థియేటర్స్ లోకి రావాలని మెగా ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు. మరి.. ఏం జరగనుందో చూడాలి.
