protest | మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్ వైఖరికి నిరసన

protest | మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్ వైఖరికి నిరసన
దేశవ్యాప్త నిరసనలకు ఎన్డీఏ పిలుపు
సీఎం రేవంత్ ఇంటి ముట్టడికి సిద్ధమైన రాష్ర్ట బీజేపీ
పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు రాంచందర్‌రావును గృహ నిర్బంధం
తార్నాకలోని రాంచందర్ రావు ఇంటి వద్ద భారీగా పోలీసులు
protest | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన కాంగ్రెస్ వైఖరికి నిరసనగా నేడు దేశవ్యాప్తంగా నిరసనలకు ఎన్డీఏ పిలుపునిచ్చింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద నిరసనకు తెలంగాణ బీజేపీ సిద్ధమైంది. అప్రమత్తమైన పోలీసులు భారతీయ జనతా పార్టీ నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.ఇందులో భాగంగానే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు బయటకు రాకుండా తార్నాకలోని ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. తనను గృహ నిర్బంధం చేయడం పట్ల రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నారీ శక్తికి ద్రోహం చేసిన కాంగ్రెస్‌ను వదిలిపెట్టమని హెచ్చరించారు.
