king| ఐపీఎల్‌లో కోహ్లీ @800 ఫోర్లు

king| ఐపీఎల్‌లో కోహ్లీ @800 ఫోర్లు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : రికార్డుల రారాజుగా విరాట్ కోహ్లీకి పేరుంది. అందుకు త‌గ్గ‌ట్టే అత‌ని ఆట తీరు కూడా ఉంటుంది. ఇంట‌ర్నేష‌న‌ల్ మ్యాచుల్లోనే కాకుండా ఐపీఎల్‌లోనూ పరుగుల వ‌ర‌ద పారిస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కోహ్లీ. ఇంట‌ర్నేష‌న‌ల్‌లో వ‌న్డేలు మాత్ర‌మే ఆడుతున్న కోహ్లీ ప్ర‌స్తుతం అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌లో కింగ్ చెల‌రేగి ఆడుతున్నాడు. ఈ సీజ‌న్‌లో కోహ్లీ మరో అరుదైన మైలురాయిని అధిగమించాడు. మైదానంలో పరుగుల వరద పారించడంలోనే కాకుండా, బౌండరీల వర్షం కురిపించడంలోనూ తనకు సాటిలేరని కింగ్ కోహ్లీ మరోసారి నిరూపించుకున్నాడు. నిన్న గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ చరిత్రలోనే 800 ఫోర్లు బాదిన మొట్టమొదటి బ్యాటర్‌గా సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఈ అద్భుత ఘనతను సాధించడానికి కోహ్లీకి 266 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఐపీఎల్లో 9,000 పరుగుల మైలురాయికి చేరువలో ఉన్నాడు.

Leave a Reply